శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.84 కోట్లు
దర్శించుకున్న భక్తుల సంఖ్య 63,421
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుమల పుణ్య క్షేత్రం. రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).
ఇదిలా ఉండగా 63 వేల 421 మంది భక్తులు దర్శించుకున్నారు. 19 వేల 644 మంది భక్తులు తల నీలాలు సమర్పించుకున్నారు. భక్తులు నిత్యం సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.84 కోట్లు వచ్చినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మా రెడ్డి వెల్లడించారు.
శ్రీ వేంకటేశ్వర స్వామి , శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించు కునేందుకు 11 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 12 గంటలకు పైగా సమయం పడుతుందని టీటీడీ తెలిపారు.
ఇదిలా ఉండగా తిరుమల గౌరవ ప్రధాన అర్చకుడిగా విశిష్ట సేవలు అందిస్తున్న శ్రీ రమణ దీక్షితులను విధుల నుంచి తొలగిస్తూ తీర్మానం చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి.