జగన్ రెడ్డిపై యుద్దానికి సిద్దం
ప్రకటించిన పవన్ కళ్యాణ్
తాడేపల్లి గూడెం – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. తాడేపల్లి గూడెంలో టీడీపీ, జనసేన సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జన విజయ కేతనం సభలో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.
రోజు రోజుకు జగన్ రెడ్డి పాలన పట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ కొలువు తీరాక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడని ధ్వజమెత్తారు పవన్ కళ్యాణ్. జగన్ రెడ్డి దుష్ట పాలనపై యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
వైసీపీ సర్కార్ వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ప్రజలు జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేందుకు సిద్దంగా ఉన్నారని జోష్యం చెప్పారు. బ్రిటీష్ తరహాలో విభజించి పాలిస్తున్నారంటూ ధ్వజమెత్తారు పవన్ కళ్యాణ్.
రాష్ట్రంలో జరగబోయే శాసన సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి పవర్ లోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.