జగన్..బాబుపై జగన్ ఫైర్
వాళ్లకు అంత సీన్ లేదు
అమరావతి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ , టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు పదే పదే తనను టార్గెట్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఆరోపణలు చేయడం తప్ప వాళ్లు చేసింది ఏమీ లేదన్నారు.
ఆరు నూరైనా సరే తిరిగి తాము అధికారంలోకి వస్తామని చెప్పారు. ఆ ఇద్దరు నేతలు పగటి కలలు కంటున్నారని, వారు ఖంగు తినడం ఖాయమని జోష్యం చెప్పారు జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏ రాజకీయ పార్టీ కార్యకర్త అయినా తమ నాయకుడి గురించి కాలర్ ఎగరేసి చెప్పే పరిస్థితి ఉన్నప్పుడే ఆ పార్టీకి గౌరవం ఉంటుందన్నారు. నేడు దేశ రాజకీయాల్లో విశ్వసనీయత ఉన్న ఏకైక పార్టీ ఒక్క వైఎస్సార్ సీపీ మాత్రమేనని స్పష్టం చేశారు జగన్ మోహన్ రెడ్డి.
ఈ విషయం రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో వినిపిస్తోందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో నవ రత్నాలు అమలు చేశామన్నారు. వాలంటీర్ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిచిందని , దీనిని కేంద్రం కూడా ప్రశంసించిందని చెప్పారు.
గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని ధైర్యంగా చెప్పే పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలోని 87 శాతం కుటుంబాలకు మన ప్రభుత్వంలో మంచి చేయగలిగామని చెప్పేందుకు గర్వపడుతున్నానని స్పష్టం చేశారు జగన్ రెడ్డి.