NEWSTELANGANA

క‌ష్టప‌డ్డా సీఎంను అయ్యా

Share it with your family & friends

ఎనుముల రేవంత్ రెడ్డి

హైదరాబాద్ – రాష్ట్రంలో సీఎంగా కొలువు తీరిన ఎనుముల రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను అయ్య పేరు చెప్పుకుని రాజ‌కీయాల్లోకి రాలేద‌న్నారు. ఆయ‌న కేసీఆర్, కేటీఆర్, హ‌రీశ్ రావు, క‌విత‌ల‌ను టార్గెట్ చేశారు. వాళ్ల‌కు అంత సీన్ లేద‌ని ఎద్దేవా చేశారు.

సోష‌ల్ మీడియా త‌మ చేతుల్లో ఉంటే గెలిచి ఉండే వాళ్ల‌మ‌ని కేటీఆర్ చెప్ప‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు. ప్ర‌జ‌ల‌ను ప్రేమించ‌ని వాళ్ల‌కు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అహంకార పూరితంగా వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్ల‌నే జ‌నం బండకేసి కొట్టారంటూ ఎద్దేవా చేశారు.

ఈ సీఎం కుర్చీ ఈనాం కింద ఇచ్చింది కాద‌ని, ప్ర‌జ‌లు ఆశీర్వ‌దిస్తే, ఓట్లు వేస్తే వ‌చ్చింద‌న్న విష‌యం తెలుసుకుంటే మంచిద‌ని అన్నారు రేవంత్ రెడ్డి. నేను నీ లాగా నీ అయ్య కేసీఆర్ ను వాడుకుని ఎమ్మెల్యే గా, మంత్రిగా కాలేదంటూ నిప్పులు చెరిగారు.

నల్లమల్ల అడవి నుంచి నీలాంటి వాళ్లను తొక్కుకుంటూ వచ్చిన కాబట్టే ఈరోజు కార్యకర్తలు నన్ను ఈ కుర్చీలో కూర్చోబెట్టారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉన్న టీవీలన్నీ మీ సుట్టపోళ్లవే కదా అంటూ ఎద్దేవా చేశారు. మాకు ఏమ‌న్నా టీవి ఉందా లేక పేప‌ర్ అంటూ ఉందా అని ప్ర‌శ్నించారు.

కార్యకర్త స్థాయి నుంచి జెండాలు మోసి పోరాటాలు చేసి.. లాఠీ దెబ్బలు తిని.. అక్రమ కేసులు ఎదుర్కొని.. చంచల్ గూడా, చర్లపల్లి జైలులో మగ్గినా తలొంచకుండా నిటారుగా నిలబడ్డాన‌ని అన్నారు రేవంత్ రెడ్డి.