బీజేపీ అడ్రస్ లేకుండా చేస్తాం
నిప్పులు చెరిగిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్ – రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన బీజేపీని టార్గెట్ చేశారు. తాము తల్చుకుంటే రాష్ట్రంలో కాషాయం లేకుండా చేస్తామని హెచ్చరించారు. పదే పదే తమపై , సర్కార్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
ప్రజాస్వామ్య యుతంగా తాము ప్రజలు ఎన్నుకుంటే వచ్చామని, కానీ తాము మీలాగా కులం పేరుతో, మతం పేరుతో మారణ హోమం సృష్టించి, మనుషుల మధ్య భేదాలు సృష్టించి పబ్బం గడపాలని చూస్తున్నారని ఆరోపించారు శ్రీధర్ బాబు.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని జోష్యం చెప్పారు మంత్రి. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. మొత్తం 17 సీట్లను క్లీన్ స్వీప్ చేస్తామన్నారు. రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు చేయాలని అనుకుంటే ప్రజలు బండకేసి కొడతారని హెచ్చరించారు.
ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వం కూలి పోతోందంటూ పదే పదే బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ చెప్పడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఉరికించి కొట్టండం ఖాయమన్నారు దుద్దిళ్ల శ్రీధర్ బాబు.