క్రీస్తు సందేశం మానవాళికి అవసరం
సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపు
హైదరాబాద్ – ఏసు క్రీస్తు జీవితం, ఆయన ఇచ్చిన సందేశం సమస్త మానవాళికి అత్యంత స్పూర్తి దాయకమని పేర్కొన్నారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. సమాజంలో శాంతి, ప్రేమ సందేశాలను వ్యాపించేలా చేయడంలో కృషి చేస్తున్న క్రైస్తవులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు.
మెదక్ డయాసిస్ బిషప్ పద్మారావు, రెవరెండ్ జాన్ జార్జ్, డాక్టర్ ఏఎంజే కుమార్, శ్యామ్ అబ్రహం, అనిల్ థామస్ తో పాటు వివిధ చర్చిలకు చెందిన క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, ఇండిపెండెంట్ చర్చిల ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇవాళ కలిశారు.
ఈ సందర్బంగా సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎవరైనా సరే తనను కలవచ్చని, ఎవరికి ఎలాంటి కష్టం ఉన్నా తాను ఆదుకుంటానని అన్నారు.
క్రైస్తవులు కూడా సమాజ అభివృద్దిలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. వారి సేవలను ప్రభుత్వం వాడుకుంటుందని చెప్పారు. మైనార్టీ సంస్థలకు మెరుగైన రీతిలో నిధులు విడుదల చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.