3న దుబాయ్ లో గామా అవార్డ్స్
పాల్గొననున్న సినీ నటీ నటులు
హైదరాబాద్ – దుబాయ్‌లో ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ గామా తెలుగు మూవీ అవార్డ్స్ 4th ఎడిషన్ అంగరంగ వైభవంగా జరగనుంది. మార్చి 3న దుబాయ్ లోని జబిల్ పార్క్ లో ప్రెస్టీజియస్ గా ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ గామా అవార్డ్స్ వేడుకను నిర్వహించనున్నారు.
ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ సారధ్యంలో గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు ఈ వేడుకను నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి జ్యూరీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ కోటి, జ్యూరీ సభ్యులు విఎన్ ఆదిత్య, రఘు కుంచె, నిర్మాత డీ వీ వీ దానయ్య, దర్శకుడు సాయి రాజేష్, ప్రసన్న, హీరోయిన్ డింపుల్ హయతి, గామా అవార్డ్స్ సీఈఓ సౌరభ్, ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ సుశీల్, ఫణి మాధవ్ కలిసి ఈ అవార్డుకు సంబంధించి ట్రోఫీ లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కోటి మాట్లాడారు. గతంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన గామా అవార్డ్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిందని చెప్పారు. మధ్యలో మూడేళ్ల పాటు కోవిడ్ తో పాటు ఇతర కారణాలతో కేసరి త్రిమూర్తులు ఈ వేడుక నిర్వహించలేక పోయారని తెలిపారు.