కొకైన్ తీసుకున్న డైరెక్టర్ క్రిష్
రిమాండ్ రిపోర్టులో కీలక నివేదిక
హైదరాబాద్ – తెలంగాణలో మరోసారి కలకలం రేపింది డ్రగ్స్ వ్యవహారం. హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాడిసన్ బ్లూ హోటల్, పబ్ లో 10 మంది పట్టుబడ్డారు. ఈ పట్టుబడిన వారిలో సినీ రంగానికి చెందిన వారితో పాటు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత కొడుకు ఉండడం విస్తు పోయేలా చేసింది.
ఈ డ్రగ్స్ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన రాడిసన్ డ్రగ్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విచారణలో కీలక అంశాలు వెల్లడైనట్లు సమాచారం. డ్రగ్స్ కేసులో ఎఫ్ఐఆర్ లో మరో ఇద్దరిని నిందితులుగా చేర్చారు.
ఏ11 గా వివేకానంద డ్రైవర్ ప్రవీణ్ , డ్రగ్ సప్లయర్ ఏ12 మీర్జా వహీద్ బేగ్ ను చేర్చడం విస్తు పోయేలా చేసింది. గత ఏడాది నుండి నిందితుడు వివేక్ డ్రగ్స్ కి బానిస అయినట్లు రిమాండ్ రిపోర్టు లో పేర్కొన్నారు. వివేక్ తన స్నేహితులైన ఏ10గా డైరెక్టర్ క్రిష్, నిర్భయ్ సిందితో కలిసి డ్రగ్స్ తీసుకున్నాడని ఆరోపించింది.
ఈ నెల 24 జరిగిన రాడిసన్ హోటల్ డ్రగ్ పార్టీ లో డైరెక్టర్ క్రిష్ పాల్గొన్నట్లు గుర్తించారు. ఈ కేసులో శ్వేత ,లిసి ,నీల్ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందన్నారు. డ్రగ్స్ పార్టీ జరిగిన ప్రతి సారి కూడా రాడిసన్ హోటల్ లోనే డైరెక్టర్ క్రిష్, నిర్భయ్ కలుసుకున్నట్లు గుర్తించారు.
పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ మీర్జా వహీద్ బేగ్ నుండి గ్రాము కొకైన్ ను 14 వేలకు కొనుగోలు చేశాడన్నారు. వివేకా సూచనల మేరకే డ్రైవర్ ప్రవీణ్ కు అబ్బాస్ సరఫరా చేశాడని తెలిపారు. రెండు గ్రాముల కొకైన్ ను సయ్యద్ అలీ కి డ్రైవర్ ప్రవీణ్ 32000 గూగుల్ పే ద్వారా చెల్లించాడని వెల్లడించారు.
వివేక్ తన స్నేహితులు రఘుచరణ్, కేదార్నాథ్, సందీప్,శ్వేత ,లిసి ,నిల్ ,డైరెక్టర్ క్రిష్ తో డ్రగ్ పార్టీ చేసుకున్నట్లు గుర్తించారు. పేపర్ రోల్‌ని ఉపయోగించి తన స్నేహితులతో కలిసి వివేక్ 3 గ్రాముల కొకైన్ సేవించారని తెలిపారు.
రాడిసన్ హోటల్లోని 1200 , 1204 నెంబర్ గల రెండు గదుల్లో డ్రగ్స్ సేవించినట్లు నిందితులు ఒప్పుకున్నారని పేర్కొన్నారు.