వంగవీటి రాధాపై వైసీపీ ఫోకస్
పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నం
విజయవాడ – ఏపీ వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. త్వరలో రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడుతున్నాయి. నేతలు మాటలకు పదును పెడుతున్నాయి. ప్రధానంగా మరోసారి పవర్ లోకి రావాలని ప్రయత్నం చేస్తోంది వైసీపీ. ఆ పార్టీ వ్యవస్థాపకుడు, సీఎం జగన్ మోహన్ రెడ్డి వై నాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళుతున్నారు.
పార్టీ నుంచి పలువురు కీలక నేతలు వీడడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది. గత ఎన్నికల్లో నవ రత్నాలు పేరుతో ప్రజల వద్దకు వెళ్లారు. వీటిని ఆధారం చేసుకుని ప్రజలు ఆదరించారు. అక్కున చేర్చుకున్నారు.
ఇది పక్కన పెడితే గతంలో వైసీపీలో చేరి చివరకు ఇముడ లేక గుడ్ బై చెప్పారు వంగ వీటి మోహన రంగా తనయుడు వంగవీటి రాధా. తిరిగి ఆయనను పార్టీలోకి తీసుకు వచ్చేందుకు మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించింది వైసీపీ. పార్టీ తరపున మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని చర్చలు జరిపారు. ఈసారి ఎన్నికల్లో బందరు నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని నేతలు సూచించినట్లు సమాచారం.