ఏపీలో మళ్లీ జగనే సీఎం
జనధర్ ఇండియా సర్వే
అమరావతి – ఏపీలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండ బోతున్నాయనే దానిపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. ఈసారి సీన్ మార బోతోందని, రాజకీయాలు తారుమారు కానున్నాయని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఏపీలో శాసన సభ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి.
ప్రధానంగా శాసన సభ వరకు చూస్తే 175 స్థానాలు ఉన్నాయి. పలు సర్వే సంస్థలు అటు ఇటుగా చెబితే తాజాగా గురువారం జనధర్ ఇండియా సర్వేలో మళ్లీ వైసీపీ బాస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు కానుందని జోష్యం చెప్పింది.
49.2 ఓట్ల శాతంతో వైసీపీ 125 సీట్లు కైవసం చేసుకోబోందని పేర్కొంది. 46.3 శాతంతో తెలుగుదేశం పార్టీ 50 సీట్లతో సరి పెట్టుకుటుందని, 1.1 శాతంతో భారతీయ జనతా పార్టీ, 1.3 శాతంతో కాంగ్రెస్ పార్టీ ఓట్లు సాధిస్తాయని తెలిపింది.
మొత్తంగా జనసేన పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నా ఫలితం ఏమీ ఉండబోదంటూ సర్వే తేల్చి పారేసింది. దీంతో వైసీపీ శ్రేణులు సంబురాలలో మునిగి పోయాయి.