శక్తివంతమైన నేతగా రేవంత్ రెడ్డి
మోస్ట్ పవర్ ఫుల్ ఇండియన్స్ జాబితా
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అరుదైన ఘనత సాధించారు. గురువారం భారత దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుల జాబితాను ప్రకటించారు. ఇందులో మొత్తం 100 మందిని పేర్కొనగా అందులో రేవంత్ రెడ్డికి 39వ ర్యాంకు దక్కడం విశేషం.
తెలంగాణ రాష్ట్రంలో అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తొడిగి ఆ పార్టీని అధికారంలోకి తీసుకు రావడంలో కీలకమైన పాత్ర పోషించారు. టీపీసీసీ చీఫ్ గా పదేళ్లుగా రాష్ట్రంలో పాతుకు పోయిన తెలంగాణ ఉద్యమ రథ సారథి, రాజకీయ రంగంలో అపర చాణక్యుడిగా గుర్తింపు పొందిన , దేశంలోనే చక్రం తిప్పాలని అనుకున్న కేసీఆర్ ను ఢీకొన్నాడు.
ఆపై ఆయనను ఫామ్ హౌస్ కు పరిమితం చేస్తానంటూ ప్రకటించాడు బహిరంగంగా. ఆ మేరకు చెప్పి మరీ పవర్ లోకి కాంగ్రెస్ ను తీసుకు రావడంలో సక్సెస్ అయ్యాడు ఎనుముల రేవంత్ రెడ్డి. ఉమ్మడి పాలమూరు జిల్లా వంగూరు మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి చిన్న ఊరు.
జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా విజయం సాధించారు. ఎవరి అండ దండలు లేకుండానే సీఎం కుర్చీలో కూర్చున్నారు రేవంత్ రెడ్డి. ఆరు గ్యారెంటీల అమలుపై ఫోకస్ పెట్టారు. పాలనా పరంగా పరుగులు పెట్టిస్తున్నారు.