NEWSNATIONAL

మోదీపై యుద్ధానికి సిద్దం కావాలి

Share it with your family & friends

పిలుపునిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

తిరువ‌నంత‌పురం – ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన వ్య‌క్తిగా మారార‌ని , ఆయ‌న ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. దేశం యావ‌త్ మొత్తం యుద్దం చేసేందుకు సిద్దం కావాల‌ని పిలుపునిచ్చారు.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా కేర‌ళ లోని తిరువ‌నంత‌పురం స‌మ‌రాగ్ని స‌భ‌లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు ఎనుముల రేవంత్ రెడ్డి. తెలంగాణ‌లో కేసీఆర్ స‌ర్కార్ అనుస‌రించిన నిరంకుశ‌, అవినీతిమ‌య విధానాలు దేశ వ్యాప్తంగా వామ‌ప‌క్ష భావ జాలాన్ని కలుషితం చేశాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

దేశానికి లౌకిక, ప్రజాస్వామిక, అవినీతి రహిత పాలన అందించడం కాంగ్రెస్ తోనే సాధ్యమ‌న్నారు సీఎం. ప్రజాస్వామిక విధానాలను తుంగలో తొక్కి… బీజేపీ అవినీతిని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. దేశంలో మోదీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేన‌ని స్ప‌ష్టంచేశారు.

కేవలం ఎన్నికలు మాత్రమే కాదు.. మోదీని ఓడించేందుకు జరుగుతున్న యుద్ధమ‌ని అన్నారు. ఈ యుద్ధంలో మనం గెలవాలి… ఇండియా కూటమిని గెలిపించు కోవాల‌ని పిలుపునిచ్చారు ఎనుముల రేవంత్ రెడ్డి.

ఇండియా కూటమిని బలహీన పరిచేందుకు మూడో ఫ్రంట్ లేదా ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జరిగే కుట్రలకు కేసీఆర్ సహకరిస్తున్నార‌ని ఆరోపించారు.