NEWSTELANGANA

ప్ర‌భుత్వ జాబ్స్ సాధించిన వాచ్ మెన్

Share it with your family & friends

ఉస్మానియా యూనివ‌ర్శిటీలో ప‌ని

హైద‌రాబాద్ – ఎవ‌రీ గొల్లె ప్ర‌వీణ్ కుమార్ అనుకుంటున్నారా. ఉస్మానియా యూనివ‌ర్శిటీలో వాచ్ మెన్ గా ప‌ని చేస్తూ ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు ప్రిపేర్ అయ్యాడు. ఏకంగా రెండు జాబ్స్ ను సాధించాడు. అంద‌రినీ విస్తు పోయేలా చేశాడు.

ప్ర‌వీణ్ కుమార్ కు 31 ఏళ్లు. త్వ‌ర‌లో ప్ర‌భుత్వ సంస్థ‌లో బోధించనున్నాడు. ఇప్ప‌టికే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ ఉద్యోగానికి ఎంపిక‌య్యాడు. త్వ‌ర‌లో నియామ‌క ప‌త్రాన్ని అందుకోనున్నాడు. అంతే కాదు జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ (జేఎల్) తుది జాబితాలో కూడా ఉన్నాడు.

నెల వారీగా ప్ర‌వీణ్ కుమార్ క‌నీసం 73,000 నుంచి 83,000 రూపాయ‌ల దాకా జీతం అందుకోనున్నాడు. త‌న తండ్రి తాపీ మేస్త్రీగా ప‌ని చేస్తుంటే , తల్లి మంచిర్యాల జిల్లాలోని ఓ చిన్న ఊరులో బీడీ కార్మికురాలిగా ప‌ని చేస్తోంది. ప్ర‌స్తుతం ప్ర‌వీణ్ కుమార్ నైట్ వాచ్ మెన్ గా నెల‌కు రూ. 9,000 జీతం అందుకుంటున్నాడు.

విచిత్రం ఏమిటంటే ప్ర‌వీణ్ కుమార్ ఎంకామ్ , బీఈడీ, ఎంఈడీ వంటి డిగ్రీలు ఉన్న‌ప్ప‌టికీ వాచ్ మెన్ గా ప‌ని చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు.

ఈ ఉద్యోగం అతనికి ప్రభుత్వ పరీక్షలకు సిద్ధం కావడానికి, స్టడీ మెటీరియల్‌లను పొందటానికి తగినంత సమయాన్ని ఇచ్చింది.