ఎన్నికలయ్యాక కాంగ్రెస్ సర్కార్ ఉండదు
ఎంపీ ధర్మపురి అరవింద్ షాకింగ్ కామెంట్స్
నిజామాబాద్ జిల్లా – భారతీయ జనతా పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాక తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఉంటుందో ఉండదోనని అన్నారు.
గత కేసీఆర్ సర్కార్ రైతు బంధు కింద రూ. 7,000 కోట్ల రూపాయలు ఉంచారని, అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రూ. 2,000 కోట్లు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రూ. 3,000 కోట్లు తీసుకున్నారంటూ ధర్మపురి అరవింద్ సంచలన ఆరోపణలు చేశారు.
ఇదిలా ఉండగా అటు భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు భారతీయ జనతా పార్టీకి చెందిన చీఫ్ , కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి, మాజీ చీఫ్ బండి సంజయ్ తో పాటు ఎంపీ లక్ష్మణ్ సైతం ఎన్నికలయ్యాక కాంగ్రెస్ సర్కార్ ఉండదంటూ కామెంట్స్ చేశారు.
తాజాగా జరిగిన శాసన సభ ఎన్నికల్లో పదే పదే కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ , బీజేపీలను టార్గెట్ చేస్తూ వచ్చారు. ఈ రెండు పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు. మొత్తంగా ఎన్నికల వరకు ఉంటుందో లేక ఊడుతుందో అనేది వేచి చూడాలి.