మాదే అధికారం జగనే సీఎం
మాజీ మంత్రి కొడాలి నాని కామెంట్
అమరావతి – మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సూర్యుడు పడమర ఉదయించినా సరే తిరిగి ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొలువు తీరడం ఖాయమని అన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని వ్యూహాలు చేసినా వైసీవీ ఘన విజయం సాధించడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఇవాళ తాము ప్రవేశ పెట్టిన వాలంటీర్ వ్యవస్థను మోదీ ప్రభుత్వం సైతం మెచ్చుకుందని పేర్కొన్నారు కొడాలి నాని.
తాము ఎన్నికల గురించి ఆలోచించడం లేదన్నారు. కారణం ఏమిటంటే తాము తీసుకు వచ్చిన నవ రత్నాలు తమను గట్టెక్కిస్తాయన్న నమ్మకం ఉందన్నారు. గత ఎన్నికల సందర్బంగా తాము ఇచ్చిన హామీలలో 98 శాతం పూర్తి చేయడం జరిగిందన్నారు కొడాలి నాని.
జగన్ ముందు ఆటలు సాగవన్నారు. రాష్ట్రాన్ని అమరావతి రాజధాని పేరుతో రాజకీయాలు చేసిన చరిత్ర ఎవరిదో ప్రజలకు తెలుసన్నారు.