సీఎంతో ఫైనాన్స్ కమిషన్ భేటీ
తొలిసారి రేవంత్ తో స్మితా సబర్వాల్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ అత్యంత ముఖ్యమైనది. ఆయా ప్రభుత్వ రంగ సంస్థలకు దీని ద్వారా రుణాలు ఇవ్వడం, నిధులు మంజూరు చేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇదే సమయంలో ఇటీవలే మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు ఛాన్స్ ఇచ్చింది ఏఐసీసీ హైకమాండ్. ఇది ఎవరూ ఊహించ లేదు ఆయనకు ఈ కీలకమైన పదవి దక్కుతుందని. మొదటి నుంచి అధిష్టానానికి విధేయుడిగా ఉంటూ వచ్చారు రాజయ్య.
అయితే ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి. వీటిని పక్కన పెడితే తాజాగా ఆసక్తికరమైన సన్నివేశానికి వేదికైంది సచివాలయం. కారణం ఏమిటంటే సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. గత కేసీఆర్ సర్కార్ హయాంలో కీలకమైన వ్యక్తిగా , చక్రం తిప్పుతూ వచ్చారు సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్. రాష్ట్ర ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తులు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఉన్నతాధికారులు రేవంత్ ను కలుసుకున్నారు.
కానీ నిన్నటి వరకు స్మితా సబర్వాల్ మర్యాద పూర్వకంగా భేటీ కాలేదు. ఇది చర్చనీయాంశంగా మారేలా చేసింది. కాగా ఇవాళ ఉన్నట్టుండి తళుక్కున మెరిశారు స్మితా . ఫైనాన్స్ కమిటీ తో పాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సబర్వాల్ సీఎంతో భేటీ కావడం విస్తు పోయేలా చేసింది.