డ్రగ్ రహిత తమిళనాడు కావాలి
బీజేపీ చీఫ్ కె. అన్నామలై పిలుపు
తమిళనాడు – భారతీయ జనతా పార్టీ చీఫ్ కె. అన్నామలై కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. డ్రగ్స్ రహిత తమిళనాడు రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో కొలువు తీరిన సీఎం ఎంకే స్టాలిన్ ప్రభుత్వం మాదక ద్రవ్యాలను కట్టడి చేయడంలో విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఈ విషయం ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులో పర్యటించిన సమయంలో చోటు చేసుకుందన్నారు.
కల్చర్ ను విధ్వంసం చేసే దిశగా ప్రభుత్వం యత్నిస్తోందని ధ్వజమెత్తారు కె. అన్నామలై. తాము గనుక పవర్ లోకి వస్తే వెంటనే డ్రగ్స్ లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు బీజేపీ చీఫ్.
రోజు రోజుకు రాష్ట్రంలో బీజేపీకి అనూహ్యమైన రీతిలో ఆదరణ లభిస్తోందని చెప్పారు. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా కాషాయ కూటమి అభ్యర్థులు గెలుస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. తమ టార్గెట్ 400 సీట్లకు పైగానే సాధించాలని, ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు కె. అన్నామలై.