బీజేపీ గెలుపు పక్కా – కాటిపల్లి
వచ్చే ఎన్నికల్లో మాదే గెలుపు
నిజామాబాద్ జిల్లా – కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీకి ఢోకా లేదన్నారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే లోక్ సభ 17 స్థానాల్లో కాషాయం గెలుస్తుందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు ఎమ్మెల్యే.
నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో జరిగిన విజయ సంకల్ప యాత్రలో పాల్గొని ప్రసంగించారు కాటిపల్లి వెంకట రమణా రెడ్డి. దేశంలోని 143 కోట్ల మంది ప్రజలు సమర్థవంతమైన నాయకత్వాన్ని, సుస్థిరమైన పాలనను కోరుకుంటున్నారని అన్నారు. ఈ రెండూ ఒక్క బీజేపీ వల్లనే సాధ్యమవుతుందన్నారు.
యావత్ ప్రపంచం మొత్తం నరేంద్ర దామోదర్ దాస్ మోదీ వైపు చూస్తోందని చెప్పారు . ఆరు నూరైనా ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమికి ఒక్క సీటు కూడా రాదని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మోదీ పాలన వల్ల మేలు చేకూరిందని చెప్పారు. రహదారులు, పరిశ్రమల ఏర్పాటుపై ఎక్కువగా మోదీ సర్కార్ ఫోకస్ పెట్టిందని స్పష్టం చేశారు కాటిపల్లి వెంకట రమణా రెడ్డి.