NEWSANDHRA PRADESH

ఢిల్లీ లిక్క‌ర్ కేసులో కీల‌క ప‌రిణామం

Share it with your family & friends

అప్రూవ‌ర్ గా మార‌తాన‌న్న మాగుంట

అమ‌రావ‌తి – రోజు రోజుకు ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క‌మైన ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే ఈ కేసులో ప‌లువురిని అదుపులోకి తీసుకున్నారు. మ‌రికొంద‌రు జైలు పాల‌య్యారు. ఇంకొంద‌రు బెయిల్ పై బ‌య‌ట ఉన్నారు. ఇదే కేసుకు సంబంధించి అప్ డేట్ వ‌చ్చింది. అదేమిటంటే మ‌ద్యం సిండికేట్ కే రారాజుగా పేరుంది మాగుంట ఫ్యామిలీ.

విచిత్రం ఏమిటంటే తాజాగా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న ఈ త‌రుణంలో వైసీపీ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీ‌నివాసులు రెడ్డి ఉన్న‌ట్టుండి గుడ్ బై చెబుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆయ‌న త‌న‌యుడు మాగుంట రాఘ‌వ రెడ్డి కీల‌క‌మైన నిందితుడిగా సీబీఐ, ఈడీ అభియోగాలు మోపింది ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసుకు సంబంధించి.

రాఘ‌వతో పాటు మాజీ తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, గారాల ప‌ట్టీగా పేరు పొందిన క‌ల్వ‌కుంట్ల క‌విత‌తో పాటు ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ల‌ను కూడా చేర్చింది. విచార‌ణ‌కు రావాలంటూ నోటీసులు జారీ చేసింది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌.

తాను మ‌హిళ‌న‌ని, త‌న‌కు కొన్ని హ‌క్కులు ఉన్నాయంటూ కోర్టుకు ఎక్కింది క‌విత‌. ఇక ఏకంగా ఎనిమిదిసార్లు నోటీసులు పంపింది కేజ్రీవాల్ కు. అయినా ఈ ఇద్ద‌రూ రాం రాం అంటున్నారు . విచార‌ణ‌కు డుమ్మా కొడుతున్నారు. ఈ త‌రుణంలో కీల‌క అప్ డేట్ చోటు చేసుకుంది.

ఈ కేసుకు సంబంధించి తాను అప్రూవ‌ర్ గా మారుతానంటూ మాగుంట రాఘ‌వ చెప్ప‌డంతో ఆయ‌న చేసిన అభ్య‌ర్థనను రౌస్ అవెన్యూ కోర్టు అంగీక‌రించింది. మ‌రి ఆయ‌న నోరు విప్పితే ఎంత మంది పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తాయో తెలియాల్సి ఉంది.