NEWSANDHRA PRADESH

హంత‌కులు నా కుటుంబీకులు

Share it with your family & friends

సునీతా రెడ్డి షాకింగ్ కామెంట్స్

అమ‌ర‌వాతి – దివంగ‌త వైఎస్ వివేకానంద రెడ్డి త‌న‌యురాలు డాక్ట‌ర్ వైఎస్ సునీతా రెడ్డి నిప్పులు చెరిగారు. శుక్ర‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. స్వంత అన్న జ‌గ‌న్ రెడ్డి సీఎంగా ఉన్నా త‌మ‌కు న్యాయం జ‌ర‌గ‌లేద‌ని వాపోయారు. విచిత్రం ఏమిటంటే తమ కుటుంబీకులే హంతకులు అయిన‌ప్పుడు ఇక అన్యాయం త‌ప్పా న్యాయం ఎలా జరుగుతుంద‌ని ప్ర‌శ్నించారు.

నాన్న హ‌త్య జ‌రిగిన నాలుగు రోజుల త‌ర్వాత చంద్ర‌బాబు, తెలుగుదేశం పార్టీ వాళ్ల‌పై ఆనాడు తాను అనుమానం వ్య‌క్తం చేశాన‌ని తెలిపారు. కానీ రాను రాను అర్థ‌మైంది ఏమిటంటే కేసు విచార‌ణ కొన‌సాగుతున్న కొద్దీ అస‌లు వాస్త‌వాలు వెలుగు చూస్తున్నాయ‌ని పేర్కొన్నారు వైఎస్ సునీతా రెడ్డి.

ఇంత జ‌రిగినా ఏనాడూ టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌ను ప‌ల్లెత్తు మాట అన‌లేద‌న్నారు. అంత‌కంటే ఎక్కువ‌గా త‌న‌కు స‌పోర్ట్ చేశార‌ని తెలిపారు. కానీ స్వంత అన్న‌య్య అయి ఉండి , సీఎం స్థానంలో ఉన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌నిగ‌ట్టుకుని ఎవ‌రైతే త‌న తండ్రిని పొట్ట‌న పెట్టుకున్నారో వారికే త‌ను మ‌ద్ద‌తుగా నిలిచాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ఇక చెప్పాల్సింది ఏముంద‌ని ఎదురు ప్ర‌శ్న వేశారు వైఎస్ సునీతా రెడ్డి. హంత‌కులు ఎవ‌రో కాదు త‌న కుటుంబీకులేనంటూ బాంబు పేల్చారు.