విచారణకు డైరెక్టర్ డుమ్మా
మనోడు ముందస్తు హైకోర్టుకు
హైదరాబాద్ – దర్శకుడిగా ఎంతో పేరున్నా చివరకు డ్రగ్స్ కేసు విషయంలో ఆదర్శ ప్రాయంగా నిలవాల్సిన క్రిష్ అతి తెలివి తేటలు ప్రదర్శించడం విస్తు పోయేలా చేసింది. నిజంగా విచారణ చేపడితే టాలీవుడ్ కు చెందిన పలువురు పట్టుబడటం ఖాయమని ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ సీపీగా కొలువు తీరిన వెంటనే కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో ఎవరికీ లొంగని ఆఫీసర్ గా పేరు పొందారు అవినాష్ మహంతి.
అయినా అంతా లైట్ తీసుకున్నారు. తీరా బీజేపీ సీనియర్ నాయకుడి కొడుకుతో పాటు మోడల్, దర్శకుడు క్రిష్ కూడా రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో ఉన్నారంటూ బాంబు పేల్చారు సీపీ. దీంతో మనోడు విషయం తెలిసిన వెంటనే బుకాయించే ప్రయత్నం చేశాడు. నేరుగా విచారణకు హాజరు కాకుండా ముంబైకి చెక్కేశాడు క్రిష్.
గచ్చిబౌలి పోలీసులు కేసుకు సంబంధించి విచారణకు రావాల్సిందిగా కోరారు. కానీ విచారణకు డుమ్మా కొట్టాడు. హైకోర్టును ఆశ్రయించాడు క్రిష్. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
రెండు రోజులు అయ్యాక హాజరవుతానని తెలిపాడు. తీరా మరో రెండు రోజులు సమయం కావాలని కోరాడు. అంతలోపే కోర్టు మెట్లు ఎక్కాడు. తాము ఒప్పుకునే ప్రసక్తి లేదని, వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించారు సీపీ.