పవర్ షేరింగ్ లేకుండా గెలవలేం
పవన్ కళ్యాణ్ కు జోగయ్య లేఖ
అమరావతి – సీనియర్ కాపు నాయకుడు హరి రామ జోగయ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కొత్తగా జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పొత్తులో భాగంగా జనసేనకు కేవలం కొన్ని సీట్లను మాత్రమే కేటాయించారు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు.
సీట్లు, పవర్ షేరింగ్ లేకుండా కూటమి గెలుపొందడం అసాధ్యమని స్పష్టం చేశారు. కాపుల మనోభావాలు దెబ్బ తినేలా టికెట్ల కేటాయించారంటూ వాపోయారు. మన కోటా మన వాటా అన్నది మన నినాదం కావాలన్నారు. కానీ ఇవేవీ లేకుండా చంద్రబాబు గేమ్ ప్లే చేశాడంటూ ఆరోపించారు.
ఇన్నేళ్లుగా అత్యధిక జనాభా కలిగి ఉన్నప్పటికీ కాపులకు సరైన పవర్ షేరింగ్ రాలేదని పేర్కొన్నారు హరి రామ జోగయ్య. ఇప్పటికైనా అసలు వాస్తవాలను తెలుసుకుని చాలా జాగ్రత్తతో వ్యవహరించాలని సూచించారు కాపు నేత.
ప్రస్తుతం వైసీపీకి రాష్ట్రంలో ఎదురు గాలి వీస్తోందని, ఈ సమయంలో సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కీలకమైన నాయకుడిగా ఉన్నా పవర్ లో షేరింగ్ లేక పోతే ఇబ్బంది ఎదురవుతుందని ఆందోళన చెందారు హరి రామ జోగయ్య.