జగన్ గట్స్ ఉన్న లీడర్
పులివెందుల సతీష్ రెడ్డి
అమరావతి – ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వైసీపీ కండువా కప్పుకున్నారు. సతీష్ రెడ్డితో పాటు జనసేన పీఏసీ సభ్యుడు, ఆచంట నియోజకవర్గ ఇంఛార్జ్ చేగొండి సూర్య ప్రకాశ్ కూడా చేరారు. ఈ సందర్బంగా పార్టీలోకి ఆహ్వానించారు జగన్ రెడ్డి.
ఈ సందర్బంగా సతీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గత 27 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ కోసం పని చేశానని అన్నారు. తాను వైఎస్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినా తనను జగన్ ఆహ్వానించారని అన్నారు. నాతో వైసీపీ నేతలు టచ్ లోకి వచ్చాక చంద్రబాబు నాయుడు రాయబారం పంపారని మండిపడ్డారు.
ఇంత కాలం పట్టించుకోని బాబు ఇప్పుడు తన స్వార్థం కోసం పిలవడం దారుణమన్నారు సతీష్ రెడ్డి. బాబు నాయకత్వం రోజు రోజుకు దిగజారి పోయిందన్నారు. ఇప్పుడు టీడీపీలో నారా లోకేష్ పెత్తనమే నడుస్తోందన్నారు.
ఆ పార్టీలో సీనియర్లకు గౌరవం లేదని ఆరోపించారు . టీడీపీ ఒక వ్యాపార సంస్థగా మారి పోయిందని ధ్వజమెత్తారు. జగన్ తనను ప్రేమగా పలకరించారని, ఆదరించారని ప్రశంసించారు. వైసీపీ గెలుపు కోసం తాను శాయ శక్తులా కృషి చేస్తానని మాటిస్తున్నానని అన్నారు పులివెందుల సతీష్ రెడ్డి.