రాష్ట్రమంతటా గృహ జ్యోతి
జీరో విద్యుత్ బిల్లులతో సంతోషం
ములుగు జిల్లా – కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు నాలుగు గ్యారెంటీలను ప్రారంభించింది. కొత్తగా కొలువు తీరిన వెంటనే రైతు భరోసా, ఉచితంగా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులలో మహిళలకు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. దీనిపై బీఆర్ఎస్ భారీ ఎత్తున ఫైర్ అయ్యింది.
కానీ ఊహించని రీతిలో ఆర్టీసీ సంస్థకు ఆదాయం పెరిగింది. అంతకంటే పదింతలు రాష్ట్రంలోని దేవా దాయ , ధర్మాదాయ శాఖకు భారీ ఎత్తున విరాళాలు , కానుకల రూపేణా అందడంతో ప్రభుత్వం విస్తు పోయింది.
ఇదే సమయంలో రైతు బంధుకు బదులు రైతు భరోసాను ప్రారంభించింది. రైతులు, నిరుద్యోగులకు మేలు చేసేలా చర్యలు చేపట్టింది సర్కార్. కరవు, అఖిలపక్షం తరపున సలహాలు, సూచనలు తీసుకుంటామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
ఇదిలా ఉండగా పేదలు, మధ్య తరగతి కుటుంబాలకు మేలు చేకూర్చేలా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల మేరకు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ములుగు జిల్లాలో వినియోగదారులు తమ జీరో బిల్లులతో దర్శనం ఇచ్చారు. వారిని ప్రత్యేకంగా అభినందించారు మంత్రి దాసరి సీతక్క.