విద్యా..వైద్యం..ఉపాధిపై దృష్టి పెట్టండి
ప్రముఖ సామాజికవేత్త యోగేంద్ర యాదవ్
హైదరాబాద్ – ఏ దేశమైనా ముందుగా ఫోకస్ పెట్టాల్సింది విద్య..వైద్యం..ఉపాధేనని స్పష్టం చేశారు ప్రముఖ సామాజిక వేత్త యోగేంద్ర యాదవ్. సీఎంతో జరిగిన పౌర సమాజం సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. యోగేంద్ర యాదవ్ తో పాటు తెలంగాణ జన సమితి చీఫ్ ప్రొఫెసర్ కోదండ రామ్ , రియాజ్, కన్నెగంటి రవి, తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంఘాలు, సంస్థలు, మేధావులు, బుద్ది జీవులతో కూడిన పౌర సమాజం నుంచి వచ్చే ప్రతి సూచనను స్వీకరించాలని సూచించారు యోగేంద్ర యాదవ్. విద్యా రంగం వ్యాపరంగా మారిందని, ప్రత్యేకించి ఆరోగ్య రంగం కొత్త పుంతలు తొక్కుతోందని , ఒక రకంగా చెప్పాలంటే అది మాఫియాను తలపింప చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా రాహుల్ గాంధీకి అన్ని రంగాలకు సంబంధించి సూచనలు, సలహాలు అందజేస్తున్నారు యోగేంద్ర యాదవ్. రాహుల్ గత ఏడాది చేపట్టిన భారత్ జోడో యాత్ర వెనుక కీలకమైన పాత్ర పోషించారు . దీంతో ఇప్పుడు యోగేంద్ర యాదవ్ పార్టీకి అడ్వైజర్ గా ఉంటున్నారు.
మొత్తంగా దేశ పునర్ నిర్మాణంలో, రాష్ట్ర పునర్ నిర్మాణంలో తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు .