NEWSTELANGANA

టీఎస్ఆర్టీసీకి అవార్డుల పంట

Share it with your family & friends

ట్రాన్స్ పోర్ట్ ఎక్స్ లెన్స్ అవార్డులు

హైద‌రాబాద్ – ప్ర‌తి రోజూ ల‌క్ష‌లాది మంది ప్ర‌యాణీకుల‌ను చేర‌వేస్తూ విశిష్ట సేవ‌లు అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ‌కు అవార్డుల పంట పండింది. మేనేజింగ్ డైరెక్ట‌ర్ వీసీ స‌జ్జ‌నార్ సార‌థ్యంలో సంస్థ అన్ని రంగాల‌లో ముందుకు వెళుతోంది. రాష్ట్ర స‌ర్కార్ ఉచితంగా మ‌హిళ‌ల‌కు ప్రయాణ సౌక‌ర్యం క‌ల్పిస్తోంది. దీంతో గ‌తంలో ఊహించ‌ని రీతిలో బ‌స్సుల‌లో ఆక్యుపెన్సీ రేటు పెరిగింది. రోజూ ల‌క్ష‌లాది మంది ప్ర‌యాణం చేస్తున్నారు. ప‌ల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బ‌స్సుల‌న్నీ కిట కిట లాడుతున్నాయి.

దీంతో అటు న‌ష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఇటు దేవాదాయ‌, ధ‌ర్మా దాయ శాఖకు పెద్ద ఎత్తున ఆదాయం స‌మ‌కూరుతోంది. ఇదిలా ఉండ‌గా ర‌వాణా ప‌రంగా ప్ర‌తి ఏటా కేంద్ర స‌ర్కార్ నేష‌న‌ల్ బ‌స్ ట్రాన్స్ పోర్ట్ ఎక్స్ లెన్స్ అవార్డుల‌ను అంద‌జేస్తుంది. ఈసారి తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌కు ఏకంగా ఐదు నేష‌న‌ల్ బ‌స్ ట్రాన్స్ పోర్ట్ ఎక్స్ లెన్స్ అవార్డులు ద‌క్కాయి.

వీటిని మార్చి 15న న్యూఢిల్లీలో జ‌రిగే ప్ర‌ధాన కార్య‌క్ర‌మంలో వీటిని ప్ర‌దానం చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని ఆర్టీసీ ఒక ప్ర‌క‌ట‌న వెల్లడించింది.