దేశాన్ని కలపడం నేరమా
ప్రశ్నించిన రాహుల్ గాంధీ
మధ్యప్రదేశ్ – ఈ దేశంలో ఏం జరుగుతోందో మీ కందరికీ తెలుసు. కేవలం కులం ప్రాతిపదికగా..మతం ప్రాతిపదికగా, ద్వేషాన్ని మరింత చేరుస్తూ ముందుకు సాగుతోంది భారతీయ జనతా పార్టీ దాని అనుబంధ సంస్థలు. కాషాయం పేరుతో రాజకీయం చేయడం మంచి పద్దతి కాదన్నారు వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ.
తాను భారత్ జోడో యాత్ర చేపట్టిన సమయంలో గత ఏడాది తనను అనరాని మాటలు అన్నారని, ఎద్దేవా చేశారని చివరకు తనకు వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక పోయారని పేర్కొన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజలను విభజించి పాలించే కుట్రలకు తెర లేపడం మంచి పద్దతి కాదన్నారు.
గత ఏడాది తాను చేపట్టిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా ఈ ఏడాది భారత్ జోడో న్యాయ్ యాత్రకు శ్రీకారం చుట్టానని అన్నారు రాహుల్ గాంధీ. బీజేపీ మ్యానేజ్ చేస్తూ వస్తున్న మీడియా సైతం ఇవాళ తన గురించి రాయక తప్పడం లేదన్నారు. దీనికి కారణం ప్రజలేనని , వారి నుంచి వస్తున్న జనాదరణేనని పేర్కొన్నారు.
ఒక వైపు బీజేపీ కులం, మతం పేరుతో ప్రజలను విభజిస్తుంటే మరో వైపు కాంగ్రెస్ పార్టీ అందరినీ ఏకతాటి పైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు రాహుల్ గాంధీ.