హస్తం నిబద్దతకు నిదర్శనం
స్పష్టం చేసిన డీకే శివకుమార్
బెంగళూరు – ఇచ్చిన మాటను తప్పక పోవడం తమ పార్టీ ముఖ్య ఉద్దేశమని , అదే తమను గెలిపించేలా చేస్తుందని అన్నారు టీపీసీసీ చీఫ్ , డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. శనివారం చెన్న పట్నం ప్రభుత్వ గ్రాడ్యుయేషన్ పూర్వ కాలేజీ మైదానంలో హామీ పథకాల లబ్దిదారుల సదస్సు జరిగింది. ఈ సందర్బంగా డీకే శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
కాంగ్రెస్ అంటే నిబద్ధత, నిబద్ధత అంటే కాంగ్రెస్ అన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న ప్రభుత్వం మాది అని చెప్పారు. గృహలక్ష్మి, గృహజ్యోతి, శక్తి, అన్న భాగ్య, యువజన నిధి హామీ పథకాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పర్చడం జరిగిందన్నారు.
దేవుడు మనకు వరం లేదా శాపం ఇవ్వడు, అతను మనకు అవకాశం మాత్రమే ఇస్తాడని అన్నారు డీకే శివకుమార్. అందుకు తగ్గట్టుగానే ఇవాళ ప్రజలు ఇచ్చిన అవకాశంతో ప్రజానుకూల పాలన అందిస్తున్నామని చెప్పారు డిప్యూటీ సీఎం.
సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందని అన్నారు. అలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు డీకే శివకుమార్. హామీ పథకాల లబ్ధిదారులు ఇచ్చే ప్రతి కోరిక మా పనికి నిజమైన అర్థాన్ని ఇస్తుందన్నారు. రాష్ట్ర ప్రగతి తమ ప్రాధాన్యత అని, అందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.