పీఎం మోదీతో సువేందు భేటీ
రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలి
న్యూఢిల్లీ – భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ సీనియర్ నాయకుడు సువేందు అధికారి శనివారం మర్యాద పూర్వకంగా ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీతో భేటీ అయ్యారు. సువేంద్ తో పాటు డాక్టర్ సుకాంత మజుందార్ కూడా కలిశారు. ఈ సందర్బంగా ప్రధాన మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయని, ప్రతి ఒక్కరు కాషాయ జెండా ఎగుర వేసేలా చూడాలని సూచించారు మోదీ.
పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ ఆధ్వర్యంలో మమతా బెనర్జీ రాచరిక పాలన సాగిస్తోందని ఆరోపించారు. దుష్ట పాలనను ఎదుర్కొనేందుకు భారతీయ జనతా పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు, అనుబంధ సంస్థల ప్రతినిధులు విస్తృతంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఎక్కడా తగ్గ వద్దని పార్లమెంట్ ఎన్నికల్లో మన లక్ష్యం 400 సీట్లకు పైగానే రావాలని పేర్కొన్నారు. ఏ ఒక్కటి తగ్గినా తాను ఊరుకోనంటూ హెచ్చరించారు. మీకు కావాల్సినవన్నీ పార్టీ సమకూరుస్తుందని చెప్పారు. కానీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నం చేయాలని స్పష్టం చేశారు ప్రధాని మోదీ.