యాదాద్రి కాదు యాదగిరి గుట్టనే
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటన
హైదరాబాద్ – రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. చిట్ చాట్ సందర్బంగా శనివారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అత్యంత ప్రసిద్ది చెందిన దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహ్మ స్వామి అని అన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం యాదగిరిగుట్టను యాదాద్రి అని పేరు మార్చిందని ఆరోపించారు. ప్రజలు, భక్తులు ఆ పేరును ఒప్పు కోవడం లేదన్నారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన యాదగిరిగుట్టకు యాదాద్రి అన్న పేరు అవసరం లేదని పేర్కొన్నారు కోమటిరెడ్డి.
త్వరలోనే యాదాద్రి పేరు మారుస్తున్నామని, దానిని యధావిధిగా యాదగిరి గుట్టగానే మారుస్తూ జీవోను కూడా తీసుకు వస్తామని చెప్పారు. కేటీఆర్ తండ్రి చాటు బిడ్డ అని ఎద్దేవా చేశారు. రాజకీయాలు అంతగా తెలియవని పేర్కొన్నారు. తాను ఉద్యమాలు చేసి వచ్చానని చెప్పారు. దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.
కేటీఆర్ కు జీరో నాలెడ్జ్ మాత్రమే ఉందన్నారు. నాలెడ్జ్ లేని కేటీఆర్ గురించి మాట్లాడటం దండగ అని అన్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. ఒకవేళ ఫ్లోర్ లీడర్ కాక పోయి ఉండి ఉంటే తన్నీరు హరీశ్ రావు సైతం తట్టా బుట్టా సర్దుకుని బీజేపీలోకి జంప్ అయ్యే వాడంటూ సంచలన కామెంట్స్ చేశారు.