NEWSANDHRA PRADESH

టీడీపీలో చేరిన వేమిరెడ్డి..ప్ర‌శాంతి

Share it with your family & friends

కండువా క‌ప్పిన చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి – వైఎస్సార్ సీపీకి రాజీనామా చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి తో పాటు స‌తీమ‌ణి ప్ర‌శాంతి రెడ్డి శ‌నివారం తెలుగుదేశం పార్టీలో చేశారు. నెల్లూరు జరిగిన కార్య‌క్ర‌మంలో తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో టీడీపీ కండువా క‌ప్పుకున్నారు.

త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న త‌రుణంలో ఉన్న‌ట్టుండి అధికార పార్టీకి గుడ్ బై చెప్పారు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి. ఇవాళ చేరిన వారిలో వేమిరెడ్డితో పాటు రూప్ కుమార్ యాద‌వ్ , త‌దిత‌ర నేత‌లు సైతం టీడీపీలో చేరారు.

వీరంద‌రినీ పార్టీలోకి ఆహ్వానించారు చంద్ర‌బాబు నాయుడు. ఈ సంద‌ర్బంగా చంద్ర‌బాబు నేత‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. రాష్ట్రంలో వైసీపీ స‌ర్కార్ కొద్ది కాలం మాత్ర‌మే ఉంటుంద‌న్న నిజం ఎంపీ చేరిన దానితో తేలి పోయింద‌న్నారు.

జ‌న‌సేన‌, తెలుగుదేశం పార్టీల కూట‌మి శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో , సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో స‌త్తా చాటడం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. తాము ప‌వ‌ర్ లోకి రావ‌డం ఖాయ‌మ‌ని పేర్కొన్నారు. త‌మ కూట‌మికి క‌నీసం 125 సీట్ల‌కు పైగానే వ‌స్తాయ‌ని తెలిపారు నారా చంద్ర‌బాబు నాయుడు.