NEWSTELANGANA

మోదీ పాల‌న‌లో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణేది

Share it with your family & friends

మ‌హిళా కాంగ్రెస్ నేత అల్కా లాంబా

హైద‌రాబాద్ – కేంద్రంలో కొలువు తీరిన మోదీ స‌ర్కార్ హ‌యాంలో మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త అన్న‌ది లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఆల్ ఇండియా మ‌హిళా కాంగ్రెస్ అధ్య‌క్షురాలు అల్కా లాంబా. తెలంగాణ రాష్ట్ర మ‌హిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు ఆధ్వ‌ర్యంలో గాంధీ భ‌వ‌న్ లో నారీ న్యాయ్ – క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ అనే అంశం మీద మీడియాతో మాట్లాడారు.

బీజేపీ కేంద్రంలో కొలువు తీరిన త‌ర్వాత మ‌హిళ‌ల‌పై , బాలిక‌ల‌పై దాడులు, అత్యాచారాలు, హ‌త్య‌లు పెరిగి పోయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అంతే కాదు దేశంలో బీజేపీ ఆధ్వ‌ర్యంలోని రాష్ట్రాల‌లో క్రైమ్ రేట్ ఎక్కువ‌గా ఉంద‌ని పేర్కొన్నారు.

రాబోయే కాలంలో ప్ర‌జ‌లే బీజేపీకి త‌గిన రీతిలో బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు అల్కా లాంబా. ఈ స‌మావేశంలో రాష్ట్ర మ‌హిళా కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అదితి స్వ‌ప్న‌, మెహిదీప‌ట్నం డివిజ‌న్ ప్రెసిడెంట్ విజ‌య‌ల‌క్ష్మి, బాగ్ అంబర్పేట్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ సరిత, శంభుల ఉషశ్రీ,
ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, తదితరులు పాల్గొన్నారు.