NEWSANDHRA PRADESH

5,6 తేదీల్లో అభ్యర్థ్యులతో భేటీ

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన వైఎస్ ష‌ర్మిలా రెడ్డి

అమ‌రావ‌తి – కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏపీలో అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసేందుకు గాను ఈనెల 5,6 తేదీల‌లో స‌మావేశం అవుతామ‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఇప్ప‌టికే కొంత‌మందితో చ‌ర్చించ‌డం జ‌రిగింద‌న్నారు. విజ‌య‌వాడ లోని ఆంధ్రా ర‌త్న భ‌వ‌న్ లో కీల‌క భేటీ ఉంటుంద‌న్నారు.

అభ్యర్థ్యుల ఎంపికకు సంబంధించి పార్టీ ప్రాథ‌మికంగా కొన్ని గైడ్ లైన్స్ ఏర్పాటు చేశారని దాని ప్రకారం ఒడబోత కార్యక్రమం ఉంటుందని స్ప‌ష్టం చేశారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఆమె మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థ్యుల ఎంపికకు సంబంధించి పార్టీ సీనియర్ నేతలతో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల అభిప్రాయాలను కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌న్నారు.

స్క్రీనింగ్ కమిటీ జాతీయ అధ్యక్షులు మధుసూదన్ మిస్త్రీకి ఆశావహుల జాబితా పంపుతామని తెలిపారు. పారదర్శకంగా కష్టపడి పని చేసే వారికి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అవకాశం ఇస్తుందని వైఎస్ ష‌ర్మిల‌ చెప్పారు. కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు, ఏపీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ తులసిరెడ్డి పాల్గొన్నారు.