మైలవరం ఎమ్మెల్యే జంప్
టీడీపీలో చేరిన కృష్ణ ప్రసాద్
అమరావతి – అధికారంలో ఉన్న వైసీపీకి చెందిన ఎమ్మల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఝలక్ ఇచ్చారు. ఆయన ఉన్నట్టుండి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు.
మైలవరం నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేతో పాటు అనుచరులు సైతం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటికీ ప్రాధాన్యం ఇస్తూ… ఏపీని ప్రగతి మార్గంలో నడిపించే సత్తా ఒక్క చంద్రబాబు నాయుడుకే ఉందన్నారు.
రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి పాలన గాడి తప్పిందని, ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారని ఆరోపించారు. నవ రత్నాలు గట్టెక్కిస్తాయని అనుకుంటున్నాడని కానీ వాటి పేరుతో చేసిన మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారని, జగన్ రెడ్డిని, ఆయన పరివారాన్ని ఇంటికి పంపించడం ఖాయమని జోష్యం చెప్పారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.
రాబోయే రోజుల్లో జనసేన, టీడీపీ కూటమికి కనీసం 125 సీట్లకు పైగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.