NEWSTELANGANA

కాంగ్రెస్ స‌ర్కార్ బేకార్ – బండి

Share it with your family & friends

ఆరు గ్యారెంటీల క‌థేంటి

క‌రీంన‌గ‌ర్ జిల్లా – భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌న‌పై న‌మ్మ‌కం ఉంచి మ‌రోసారి ఎంపీ గా పోటీ చేసేందుకు అవ‌కాశం ఇచ్చినందుకు ప్ర‌ధాన మంత్రి మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ న‌డ్డాకు ధ‌న్య‌వాదాలు తెలిపారు ఎంపీ బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్.

ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. రాష్ట్రంలో కొలువు తీరిన సీఎం ఆరు గ్యారెంటీల‌ను అమ‌లు చేయ‌డంలో విఫ‌లం అయ్యాడంటూ ఆరోపించారు బండి సంజ‌య్ కుమార్ .

ఎన్నిక‌ల్లో మోస పూరిత‌మైన హామీలు ఇచ్చి ఓట్లు వేయించు కున్నారంటూ ఫైర్ అయ్యారు. 100 రోజులలో ఆరు గ్యారెంటీలు ఎలా అమ‌లు చేస్తారో చూస్తామ‌న్నారు. విచిత్రం ఏమిటంటే గ్యారెంటీల అమ‌లుపై రోజుకో మాట చెబుతూ కాల‌యాప‌న చేస్తున్నారంటూ మండిప‌డ్డారు బండి సంజ‌య్ కుమార్.

సబ్సిడీ సిలిండర్ మొదట వైట్ రేషన్ కార్డు ఉన్నవారికేన‌ని అన్నార‌ని , ఆ త‌ర్వాత కేవ‌లం మ‌హిళ‌ల పేరు మీద ఉన్న వారికే ఇస్తామంటున్నార‌ని , రోజుకో కొర్రీ పెడుతూ ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.