అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు
9 నియోజకవర్గాలపై క్లారిటీ
హైదరాబాద్ – పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే అన్ని పార్టీలు సన్నద్దం అయ్యాయి. ఓ వైపు బీజేపీ ఏకంగా 195 స్థానాలను ప్రకటించింది. దీంతో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి పెరిగింది. ఇక తెలంగాణలో 17 సీట్లకు గాను 9 సీట్లను ఖరారు చేసింది ఆ పార్టీ.
మరో వైపు తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇంకా మల్లగుల్లాలు పడుతోంది. పార్టీకి సంబంధించి ఆశావహులు భారీగా పెరగడంతో ఎవరికి టికెట్ కేటాయించాలనే దానిపై తర్జన భర్జన పడుతున్నారు టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి.
ఇప్పటికే ఆయన తన స్వంత జిల్లాకు చెందిన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీ చందర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని అందరికంటే ముందుగానే ప్రకటించారు. ఇదే విషయంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు పార్టీ హై కమాండ్.
అభ్యర్థుల జాబితాను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్క్రీనింగ్ కమిటీకి పంపించింది. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు 9 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసినట్టు సమాచారం. ఇందులో నాగర్ కర్నూల్ , ఖమ్మం లోక్ సభ నియోజకవర్గాలపై ఇంకా క్లారిటీ రాలేదు.