DEVOTIONAL

ఘనంగాశ్రీనివాసుడి వైభవం

Share it with your family & friends

ఆక‌ట్టుకున్న చండ మేళం

తిరుప‌తి – శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు శ్రీ రాజగోపాల స్వామి వారి అలంకారంలో చర్నాకోలు , దండం ధరించి కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు.

ఉదయం 8 గంటలకు స్వామి వారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామి వారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు.

సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జ‌రిగింది. రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు సర్వ భూపాల వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనం ఇచ్చారు.

వాహ‌న‌సేవ‌లో ఆలయ ప్ర‌త్యేకాధికారి, సిపిఆర్వో డా.టి.ర‌వి, ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్‌, వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్‌ వెంక‌ట‌స్వామి, ఆల‌య అర్చ‌కులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.