తిరుమలలో పల్స్ పోలియో
ప్రారంభించిన ఈవో ఎవి.ధర్మారెడ్డి
తిరుమల – దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్బంగా తిరుమల పుణ్య క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఆధ్వర్యంలో భారీ ఎత్తున పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని టీటీడీ ఈవో ఏవీ ధర్మా రెడ్డి ప్రారంభించారు.
చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడారు. తిరుమలలో 25 ప్రాంతాలలో పల్స్ పోలియో కేద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో భక్తులు, స్థానికులు 0 నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు విధిగా పల్స్ పోలియో చుక్కలు వేయించు కోవాలని ఆయన కోరారు.
పల్స్ పోలియో చుక్కలు వేసు కోవడం అన్నది అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎలాంటి రోగాలు రాకుండా ఉండేందుకు ఇది దోహద పడుతుందని పేర్కొన్నారు. చిన్నారుల తల్లులు దీనిని గుర్తించి తమ బాధ్యతగా పిల్లలకు పోలియో చుక్కలు వేసేలా చూడాలని సూచించారు ఏవీ ధర్మా రెడ్డి.
ఈ కార్యక్రమంలో సివిల్ సర్జన్లు డాక్టర్ బి.కుసుమ కుమారి, డాక్టర్ ఎస్.కుసుమ కుమారి, హెడ్ నర్సులు కృష్ణ కుమారి, సావిత్రమ్మ, ఇతర వైద్య, పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.