సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలి
పిలుపునిచ్చిన మాజీ సీఎం కేసీఆర్
హైదరాబాద్ – త్వరలో రాష్ట్రంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్. ఆదివారం తెలంగాణ భవన్ లో కరీంనగర్, పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించి సమీక్ష చేపట్టారు. ముఖ్య నేతలతో కేసీఆర్ ముచ్చటించారు. ఎక్కడ కూడా అలసత్వం ప్రదర్శించ వద్దని, గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు.
గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ బీఆర్ఎస్ నిర్ణయించిన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయాలని, విజయం సాధించేలా కృషి చేయాలని కేసీఆర్ కోరారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని మొత్తం 17 లోక్ సభ స్థానాలలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయాలని స్పష్టం చేశారు. పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు, శ్రేణులు, జిల్లా పరిషత్, మున్సిపల్ చైర్మన్లు, డైరెక్టర్లు ఎన్నికలపై ఫోకస్ పెట్టాలని సూచించారు.
రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని , ఏ ఒక్కరు నిరాశ చెందకుండా కదన రంగంలోకి దూకాలని అన్నారు మాజీ సీఎం కేసీఆర్.