ENTERTAINMENT

చోరీ కేసులో సౌమ్యా శెట్టి అరెస్ట్

Share it with your family & friends

ప‌క్కా స్కెచ్ వేసి కిలో బంగారం దోచేసి

హైద‌రాబాద్ – టాలీవుడ్ హీరోయిన్ సౌమ్య శెట్టి హాట్ టాపిక్ గా మారారు. ఒక‌టి కాదు రెండు తులాలు కాదు ఏకంగా కేజీ బంగారం దోచుకున్న కేసులో కీల‌క పాత్ర పోషించిన‌ట్లు పోలీసులు న‌టిని గుర్తించారు. ఈ మేర‌కు ఆదివారం ఆమెను అదుపులోకి తీసుకున్న‌ట్లు స‌మాచారం.

రిటైర్డ్ పోస్ట‌ల్ ఉద్యోగి అయిన ప్ర‌సాద్ ఇంట్లో కిలోకు పైగా బంగారాన్ని దోచుకుని అక్క‌డి నుంచి చెప్పా చేయ‌కుండా గోవాకు సౌమ్యా శెట్టి పారి పోయిన‌ట్లు గుర్తించారు పోలీసులు. అంత‌కు ముందు ప‌క్కా ప్లాన్ వేసింది ఆ బంగారాన్ని చోరీ చేసేందుకు. ఫ‌క్తు సినిమాను త‌ల‌పింప చేసేలా స‌క్సెస్ అయ్యింది ఈ న‌టి.

ముందుగా ప్ర‌సాద్ ఇంట్లో భారీ ఎత్తున బంగారం ఉంద‌ని తెలుసుకుంది సౌమ్యా శెట్టి. త‌ను న‌టి కావ‌డంతో ఆయ‌న కూతురుతో స్నేహం చేసుకుంది మొద‌ట‌గా. మెల మెల్ల‌గా వారి ఇంట్లో స‌భ్యురాలిగా మెలిగింది. ఆ త‌ర్వాత చ‌లాకీగా బంగారంతో చెక్కేసింది న‌టి. అక్క‌డి నుండి జంప్ అయ్యింది. విష‌యం తెలిసిన బాధిత కుటుంబం ల‌బోదిబోమంది. మోస పోయిన‌ట్లు గుర్తించి వెంట‌నే న‌టిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

దీంతో రంగంలోకి దిగిన ఖాకీలు సౌమ్యను గోవాలో దొరికించుకున్నారు. ఇదిలా ఉండ‌గా సౌమ్యా శెట్టి ద ట్రిప్ , యువ‌ర్స్ ల‌వింగ్లీ స‌హా ప‌లు సినిమాల‌లో న‌టించింది