NEWSANDHRA PRADESH

అభ్య‌ర్థుల ఎంపిక‌పై హైక‌మాండ్ ఫోక‌స్

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన బీజేపీ చీఫ్ పురందేశ్వ‌రి

అమ‌రావ‌తి – ఏపీ భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. జాతీయ స‌హా సంఘ‌ట‌న మంత్రి శివ ప్ర‌కాష్ ఆధ్వ‌ర్యంలో కీల‌క‌మైన స‌మావేశం జ‌రిగింద‌న్నారు.

ఇందులో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాల అధ్య‌క్షులు, ముఖ్య నేత‌ల‌తో రెండు రోజుల పాటు చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు చెప్పారు. 175 అసెంబ్లీ, 25 ఎంపి సీట్ల లో అభ్యర్థులను ఖరారు చేసి కేంద్ర నాయకత్వానికి పంపుతామ‌ని తెలిపారు.

పార్లమెంటరీ కమిటీ సమీక్ష చేసి అభ్యర్థులు ను ఖరారు చేస్తారని వెల్ల‌డించారు. జాతీయ నాయకత్వం నిర్ణయం బట్టి తదుపరి కార్యాచ‌ర‌ణ ఉంటుంద‌ని, ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి. రాష్ట్రంలో బీజేపీకి రోజు రోజుకు జ‌నాద‌ర‌ణ పెరుగుతోంద‌న్నారు.

రాబోయే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ నిర్ణ‌యాత్మ‌క పాత్ర పోషించ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. దేశంలోనే కాదు రాష్ట్రంలో కూడా స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వానికి, సుస్థిర‌మైన పాల‌న‌ను స‌మ‌ర్థిస్తున్నార‌ని తెలిపారు.