సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలి
పిలుపునిచ్చిన మల్లు రవి
నాగర్ కర్నూల్ జిల్లా – రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు ఆ పార్టీ ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ మల్లు రవి. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ల ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మల్లు రవి పాల్గొన్నారు.
పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు సైతం పాల్గొన్నారు. మంత్రి జూపల్లి కృష్ణా రావు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీ కృష్ణ, కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా పార్టీ పరంగా టికెట్ ఎవరికి ఇచ్చినా వారి విజయం కోసం ప్రయత్నం చేయాలని కోరారు డాక్టర్ మల్లు రవి.
ఇదిలా ఉండగా మొత్తం 17 ఎంపీ సీట్లకు గాను ఇంకా ఎవరినీ ఖరారు చేయలేదు టీపీసీసీ చీఫ్ , సీఎం రేవంత్ రెడ్డి. ఇది ఆయన స్వంత జిల్లా. ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్కరిని అభ్యర్థిగా ప్రకటించారు. కోడంగల్ లో జరిగిన భారీ బహిరంగ సభలో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీ చందర్ రెడ్డిని మహబూబ్ నగర్ లోక్ సభ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు.
అయితే నాగర్ కర్నూల్ వరకు వచ్చే సరికి ఇంకా సీటు ఎవరికి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ సీటు కోసం ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. మల్లు రవి , సంపత్ కుమార్ ల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతోంది వార్.