NEWSTELANGANA

బీజేపీకి షాక్ సీఎంతో శృతి భేటీ

Share it with your family & friends

నాగ‌ర్ క‌ర్నూల్ సీటుకు మంగ‌ళం

హైద‌రాబాద్ – ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో భార‌తీయ జ‌న‌తా పార్టీకి కోలుకోలేని షాక్ త‌గిలింది. పార్టీకి సంబంధించి కీల‌క‌మైన నాయ‌కురాలిగా గుర్తింపు పొందారు దివంగ‌త బంగారు ల‌క్ష్మ‌ణ్ కూతురు బంగారు శ్రుతి.

ఆమె చివ‌రి దాకా నాగ‌ర్ క‌ర్నూల్ లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా పోటీ చేయాల‌ని ప్ర‌య‌త్నం చేసింది. కానీ పార్టీ హై క‌మాండ్ ఊహించ‌ని రీతిలో ఆమెకు మొండి చేయి చూపించింది. శ్రుతి స్థానంలో ఇదే ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి, టీడీపీ ప్ర‌స్తుత ఎంపీ పోతుగంటి రాములు త‌న‌యుడు పోతుగంటి భ‌ర‌త్ కు ఎంపీ టికెట్ కేటాయించింది.

దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురయ్యారు బంగారు శ్రుతి. ఆ వెంట‌నే ఆమె నేరుగా సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఇద్ద‌రి మ‌ధ్య చాలా సేపు చ‌ర్చ‌లు జ‌రిగాయి. అయితే బంగారు శ్రుతి ఇవాళో రేపో కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్న‌ట్లు స‌మాచారం.

అయితే ఆమె మాత్రం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను కేవ‌లం మ‌ర్యాద పూర్వ‌కంగానే సీఎంను క‌లుసుకున్నాన‌ని, తాను బీజేపీలోనే ఉన్నాన‌ని, ఏ పార్టీలో చేర‌డం లేద‌న్నారు.