అభివృద్దిలో డోన్ ఏపీకి నమూనా
మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి
నంద్యాల జిల్లా – ఏపీలో అభివృద్ధి పరంగా చూస్తే డోన్ నియోజకవర్గం ఓ నమూనాగా ఉపయోగ పడుతుందన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి. సీఎం ఫోకస్ పెట్టడం వల్లనే ఇదంతా జరిగిందని చెప్పారు.
బేతంచెర్లలో రూ.62 కోట్ల కీలక అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మరో రూ.8 కోట్లతో నిర్మించే మద్దిలేటి స్వామి, ముచ్చట్ల ఆలయాల పునరుద్ధరణ పనులకు భూమి పూజ చేశారు బుగ్గన.
డోన్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చి దిద్దేందుకు ప్రత్యేక చొరవ చూపారాన్నారు.
పట్టణం నుంచి కొలుములపల్లె, ముద్దవరం, ఎం.పెండేకల్లు గ్రామాల మీదుగా రామళ్లకోట వరకు రూ.41.94 కోట్లతో 23 కి.మీ దూరం నిర్మించిన డబుల్ రోడ్డును ప్రారంభించారు. అనంతరం వీరాయిపల్లె గ్రామానికి రూ.2.35 కోట్లతో 2.45 కి.మీ మేర నిర్మించిన రహదారిని ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా వీరాయిపల్లి గ్రామానికి చెందిన 17 ఏళ్ళ అనిత అనే మానసిక దివ్యాంగురాలిని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
ప్రభుత్వం తరపున అందించే పింఛన్ తో పాటు అనిత తల్లి శ్రీదేవికి ఇంటి పట్టా ఇవ్వాలని అధికారులకు మంత్రి బుగ్గన ఆదేశాలిచ్చారు. అనంతరం రూ.75 లక్షలతో మర్రికుంట గ్రామానికి నిర్మించిన అప్రోచ్ రోడ్డును ప్రారంభించారు. గూటుపల్లె నుంచి శ్రీ పాలుట్ల రంగస్వామి ఆలయం వరకు రూ.6.50 కోట్లతో 6 కి.మీ మేర నిర్మించిన రహదారిని సైతం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు.
కనుమకింది కొట్టాల నుంచి బనగానపల్లె మండలంలోని రామకృష్ణాపురం వరకూ..కేకే కొట్టాల గ్రామం నుంచి బిలసర్గం గుహల వరకు రూ.9.35 కోట్లతో పూర్తైన రహదారిని ఆర్థిక మంత్రి ప్రారంభించారు.