DEVOTIONAL

తిరుమ‌ల క్షేత్రం పోటెత్తిన భ‌క్త‌జ‌నం

Share it with your family & friends

హుండీ ఆదాయం రూ.4.20 కోట్లు

తిరుమ‌ల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన తిరుమ‌ల‌కు పోటెత్తారు భ‌క్త బాంధ‌వులు. రోజు రోజుకు భ‌క్తులు సుదూర ప్రాంతాల నుంచి త‌ర‌లి వ‌స్తుండ‌డంతో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టింది. శ్రీ‌వారి సేవ‌కులు భ‌క్తుల‌కు ఇతోధికంగా సేవ‌లు అందిస్తున్నారు.

శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను 76 వేల 876 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 23 వేల 424 మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారని టీటీడీ వెల్ల‌డించింది. ఇదిలా ఉండ‌గా నిత్యం భ‌క్తులు స‌మ‌ర్పించే కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 4.20 కోట్లు వ‌చ్చిన‌ట్లు తెలిపారు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఈవో ఏవీ ధ‌ర్మా రెడ్డి.

భ‌క్తులు స్వామి వారి ద‌ర్శ‌నం కోసం 19 కంపార్ట్ మెంట్ల‌లో వేచి ఉన్నార‌ని, ఎలాంటి టోకెన్లు లేకుండా స‌ర్వ ద‌ర్శ‌నం కోసం వేచి ఉన్న భ‌క్తుల‌కు సంబంధించి క‌నీసం 15 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. టీటీడీ భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని పేర్కొన్నారు.