రామోజీతో రేవంత్ భేటీ
పలు అంశాలపై చర్చ
హైదరాబాద్ – రాష్ట్రంలో కొత్తగా సీఎంగా కొలువు తీరిన ఎనుముల రేవంత్ రెడ్డి అందరినీ విస్మయ పరిచారు. సోమవారం ఉన్నట్టుండి ఆయన రామోజీ ఫిలిం సిటీలో దర్శనం ఇచ్చారు. ప్రముఖ మీడియా మొఘల్ గా గుర్తింపు పొందిన ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావును మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్బంగా రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల గురించి చర్చించారు. ఇదిలా ఉండగా దేశ రాజకీయాలకు సంబంధించి రామోజీరావు ఆధ్వర్యంలోని మీడియా ఎక్స్ ఫోజ్ చేస్తూ వస్తోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కొంత కాలం పాటు ప్రభావం చేసింది.
ఇదే సమయంలో అటు కేసీఆర్ తోనూ రామోజీ రావు సాన్నిహిత్యం నెరుపుతూ వచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రామోజీ రావుపై సీరియస్ కామెంట్స్ చేశారు కేసీఆర్. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. లక్ష నాగళ్లతో దున్నుతానని ప్రకటించిన దొర ఉన్నట్టుండి మౌనం వహించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఆ తర్వాత కేసీఆర్ భయానికో లేక ఏమో కానీ ఈనాడు కూడా కరపత్రికగా మారి పోయింది. ఇంకో వైపు ఏపీలో సీఎం జగన్ రెడ్డి దెబ్బకు రామోజీ రావు మంచం ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది.