NEWSTELANGANA

బీఆర్ఎస్ ఎంపీ అభ్య‌ర్థులు ఖ‌రారు

Share it with your family & friends

నాలుగు స్థానాల‌కు ప్ర‌క‌టించిన కేసీఆర్

హైద‌రాబాద్ – త్వ‌ర‌లో రాష్ట్రంలో జ‌ర‌గ‌బోయే లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ సార‌థ్యంలోని భార‌త రాష్ట్ర స‌మితి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తెలంగాణ భ‌వ‌న్ లో పార్టీ బాస్ ఆధ్వ‌ర్యంలో క‌రీంన‌గ‌ర్, పెద్ద‌ప‌ల్లి, మ‌హ‌బూబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల స‌న్నాహ‌క స‌మావేశం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా కేసీఆర్ నాలుగు ఎంపీ స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశారు. క‌రీంన‌గ‌ర్ లోక్ స‌భ స్థానం నుంచి బోయిన‌ప‌ల్లి వినోద్ కుమార్ ను ప్ర‌క‌టించారు. ఆయ‌న గ‌తంలో రాష్ట్ర ప్ర‌ణాళిక సంఘం వైస్ చైర్మ‌న్ గా ఉన్నారు.

పెద్ద‌ప‌ల్లి లోక్ స‌భ స్థానం నుంచి ఊహించ‌ని విధంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ ను ఖరారు చేశారు. ఎప్ప‌టి లాగే ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త నామా నాగేశ్వ‌ర్ రావుకు కేటాయించారు కేసీఆర్. గ‌తంలో టీడీపీలో ఉన్నారు. ఆ త‌ర్వాత గులాబీ జెండా క‌ప్పుకున్నారు. ఇక మ‌హబూబాద్ లోక్ స‌భ నుంచి మాజీ ఎమ్మెల్యే మాలోతు క‌విత‌కు ఛాన్స్ ఇచ్చారు బీఆర్ఎస్ బాస్.

గత రెండు రోజులుగా ఆయా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో చర్చించారు. సమష్టి నిర్ణయం ప్రకారం ఏకగ్రీవంగా ఎంపికైన న‌లుగురు అభ్య‌ర్థుల‌ను బీఆర్ఎస్ చీఫ్ వెల్ల‌డించారు.