జగన్ రెడ్డి ఓ సైకో – వసంత
వైసీపీ ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్
అమరావతి – వైసీపీకి ఝలక్ ఇచ్చి ఇటీవలే టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ బాస్, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఓ ఛానల్ తో ముఖా ముఖి నిర్వహించారు.
జగన్ రెడ్డి అనుకున్నంత అమాయకుడు కాడని, అసాధ్యమైన వ్యక్తి అని పేర్కొన్నారు. సీఎం పదవిని అడ్డం పెట్టుకుని అనరాని మాటలు అన్నారని ఆరోపించారు. అతడో సైకో అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
వసంత కృష్ణ ప్రసాద్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
ఎమ్మెల్యేలు అన్నది చూడకుండా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని అసెంబ్లీ సాక్షిగా అందరి ముందు అనరాని మాటలు అన్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆత్మ గౌరవం లేని చోట తాము ఉండలేమని , టీడీపీలో చేరడం జరిగిందని చెప్పారు వసంత కృష్ణ ప్రసాద్.
జగన్ మోహన్ రెడ్డిది ఓ చిత్రమైన మనస్తత్వం అంటూ మండిపడ్డారు. తనకు , తన కెరీర్ కు ఎవరు అడ్డు వచ్చినా తట్టు కోలేడన్నారు. చివరకు తనకు జన్మను ప్రసాదించిన తల్లిని , చెల్లిని సైతం బజారులోకి ఈడ్చిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు ఎమ్మెల్యే.