ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ
ప్రకటించిన పార్టీ చీఫ్ కేసీఆర్
హైదరాబాద్ – త్వరలో రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలు యుద్ధానికి సిద్దం అయ్యాయి. నువ్వా నేనా అంటూ మాటల తూటాలు పేల్చుతున్నాయి. ఈ తరుణంలో రాష్ట్రంలో అధికారం కోల్పోయిన భారత రాష్ట్ర సమితి పార్టీ మరింత దూకుడు పెంచింది.
పార్టీని బలోపేతం చేయడం, శ్రేణులు, నేతలను కార్యోన్ముఖులను చేయడంపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఈ మేరకు లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు.
ఇప్పటికే నల్లగొండ వేదికగా సీఎం గర్జన వినిపించారు. కాంగ్రెస్ సర్కార్ ను ఎండగట్టారు. ఓ వైపు తాను అనారోగ్యం ఉన్నప్పటికీ పార్టీని ముందుకు తీసుకు పోవడంలో దృష్టి సారించారు. ఈ సందర్బంగా తాజాగా ఖమ్మం, మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించి కీలక సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ మాట్లాడారు. పార్టీని వీడుతున్న వాళ్ల గురించి ఆలోచించాల్సిన పని లేదన్నారు. వాళ్ల వల్ల ఎలాంటి నష్టం లేదన్నారు. వెళ్లి పోతున్న వాళ్లను ఆపొద్దంటూ సూచించారు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఇప్పటి నుంచే వ్యతిరేకత మొదలైందన్నారు. ఇక రాబోయే కాలం గులాబీదేనంటూ జోష్యం చెప్పారు కేసీఆర్. త్వరలో ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఆదేశించారు.