గూగుల్ యాడ్స్ లలో బీజేపీ టాప్
భారీగా ఖర్చు చేసిన పార్టీలో నెంబర్ 1
హైదరాబాద్ – దేశంలో కొలువు తీరిన మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సీజేఐ చంద్రచూడ్ కొట్టిన దెబ్బకు కేంద్రం విల విల లాడుతోంది. త్వరలో దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఆయా పార్టీలు తమ ప్రచారం కోసం సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా దేశంలో అత్యధికంగా యాడ్స్ కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్న పార్టీలలో టాప్ లో నిలిచింది బీజేపీ.
ఇప్పటికే పార్టీ ఫండ్స్ లలో వేల కోట్లు ఆ పార్టీలో జమ చేరాయి. ఇది పక్కన పెడితే తెలంగాణ, ఏపీలకు సంబంధించి వస్తున్న యాడ్స్ లలో కాషాయం అగ్ర భాగాన ఉండడం విస్తు పోయేలా చేసింది. విచిత్రం ఏమిటంటే తెలంగాణలో టీడీపీ, ఐప్యాక్ లు అత్యధికంగా ఖర్చు చేస్తున్నాయని తేలింది.
దేశంలో గూగుల్ లో రాజకీయ ప్రకటనల (యాడ్స్ ) కోసం మొత్తం 63 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో భారతీయ జనతా పార్టీ ఏకంగా రూ. 30 కోట్లు ఖర్చు చేయడం విశేషం. ఆ తర్వాతి ప్లేస్ లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషణ్ సంస్థ రూ. 21 కోట్లు ఖర్చు చేసింది.
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలు ప్రచారం కోసం ఎక్కువగా ఖర్చు పెట్టే పనిలో పడ్డారు. రాజకీయ పార్టీల ప్రకటనల పరంగా చూస్తే మొత్తం ఖర్చు రూ. 2.6 కోట్లు. బీజేపీ రూ.1.1 కోట్లు ఉండగా , సీబీసీ రూ. 50 లక్షలు, ఐప్యాక్ రూ. 60 లక్షలు, టీడీపీ రూ. 13 లక్షలు ఖర్చు చేశాయి.
ఇక ఏపీ పరంగ ఆచూస్తే రాజకీయ ప్రకటనలపై మొత్తం ఖర్చు రూ. 4.2 కోట్లు. ఐప్యాక్ రూ. 2.5 కోట్లు ఖర్చు చేస్తే బీజేపీ రూ. 65 లక్షలు ఖర్చు చేసింది. సీబీసీ రూ. 63 లక్షలు, టీడీపీ రూ. 13 లక్షలు, వైఎస్సార్సీపీ రూ. 11 లక్షలు ఖర్చు పెట్టినట్లు తేలింది.